Header Banner

BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్.. రెండు కొత్త రీచార్జ్ ప్లన్స్! అతి తక్కువ ధరకే - మీ ఫ్యామిలీకి స్పెషల్ గా!

  Sun Apr 27, 2025 13:30        Business

BSNL రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. ఒకటి డేటా కోసం, మరొకటి ఫ్యామిలీ మొత్తం ఉపయోగించడానికి చాలా బాగుంది. BSNL తీసుకువచ్చిన రూ.107 రీచార్జ్ ప్లాన్ చూస్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ప్లాన్‌కి మీరు చెల్లించాల్సింది కేవలం 107 రూపాయలు మాత్రమే. కానీ అందులో లభించే లాభాలు మాత్రం ఖచ్చితంగా ఎక్కువే. ఈ ప్లాన్ 35 రోజుల పాటు వాలిడిటీ ఇస్తుంది. అంటే సరిగ్గా ఒక నెల కంటే కొద్దిగా ఎక్కువ. దీనిలో మీరు పొందే ఇంటర్నెట్ డేటా మొత్తం 3 జీబీ. అలాగే, ఈ ప్లాన్‌తో మీరు 200 నిమిషాల వరకూ స్థానికంగా (Local) లేదా STD కాల్స్‌కి ఉపయోగించుకోవచ్చు. ఈ కాల్స్ ఏ నెట్‌వర్క్‌కైనా సరే, ఎలాంటి సమస్యలేకుండా వాడుకోవచ్చు. ఆన్‌లైన్ వాడకం ఎక్కువగా ఉండే వారికంటే, కొంతమంది కి చిట్టి చిట్టిగా డేటా అవసరమైన వారికి ఇది బాగా సరిపోతుంది. ఇంకా ఈ ప్లాన్‌తో మీరు ఒక BSNL ట్యూన్‌ను ఉచితంగా సెట్ చేయవచ్చు. మ్యూజిక్ ప్రియులకు ఇది ఒక అదనపు గిఫ్ట్ లాంటిది. అయితే, ఈ ప్లాన్‌లో ఎస్ఎంఎస్ (SMS) ఫీచర్ ఉండదు. అంటే మీరు మెసేజ్‌లను పంపడం కోసం వేరే ప్లాన్ తీసుకోవాల్సి రావచ్చు.

 

ఇది కూడా చదవండి: "ఫ్లిప్‌కార్ట్ మెగా సేల్".. కస్టమర్లకు జాక్‌పాట్.. ఐఫోన్, AC లలో భారీ డిస్కౌంట్! ఆ కార్డుంటే బంపర్ ఆఫర్..

 

రూ.798 ప్లాన్ – ఫ్యామిలీ మొత్తం కోసం..

ఇప్పుడు BSNL ఫ్యామిలీ ప్లాన్ తీసుకువచ్చింది. దీని ధర రూ.798 మాత్రమే. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే, ఒకే ఒక్క రీచార్జ్‌తో మూడు మంది సభ్యులు ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక్క యూజర్ ప్లాన్ రీచార్జ్ చేస్తే, మిగతా ఇద్దరు అదనంగా లైన్లు (సిమ్‌లు) జత చేయొచ్చు. ఇది మధ్యతరగతి కుటుంబాల కోసం తీసుకొచ్చిన బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ఈ ప్లాన్‌తో రోజూ లిమిట్ లేని కాల్స్ (Unlimited Calling) లభిస్తాయి. అదనంగా, మొత్తం 150 జీబీ డేటా లభిస్తుంది. ఇది ఒక్కరికి 50 జీబీ చొప్పున లెక్క. ప్రతి యూజర్ కూడా 100 ఎస్ఎంఎస్‌లు రోజూ పంపుకోవచ్చు. ఇప్పుడు మనం వేరువేరు ప్లాన్లపై ఖర్చు పెట్టే బదులు, ఒకే ప్లాన్‌తో మొత్తం ఫ్యామిలీకి నెట్ మరియు కాలింగ్ అవసరాలు తీరిపోతాయి.

 

BSNL తాజా పంథా – వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యం..

ఈ రెండు ప్లాన్లు చూస్తే BSNL చాలా క్లారిటీతో ఆలోచిస్తున్నట్టే అర్థమవుతుంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలు పెంచుతున్న సమయంలో, BSNL మాత్రం ప్రజల అవసరాలపై దృష్టి పెట్టింది. మామూలుగా చూస్తే, 107 రూపాయలకు ఈ స్థాయి డేటా, కాలింగ్ లభించటం చాలా అరుదు. అలాగే, రూ.798 ప్లాన్‌లో మూడు మంది ఉపయోగించుకునే అవకాశాన్ని ఇవ్వటం వినియోగదారులపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో చెప్పకనే చెబుతుంది. BSNL ఈ ప్లాన్ల గురించి తన అధికారిక X (Twitter) ఖాతాలో వెల్లడించింది. మీరు ఈ ప్లాన్ల వివరాలు BSNL వెబ్‌సైట్‌లో కూడా చూసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఫోన్‌లో ఈ ప్లాన్లను రీచార్జ్ చేసుకుంటే చాలా లాభం ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: ఇప్పుడు రుణాలు మరింత చౌకగా! కెనరా & ఇండియన్ బ్యాంక్‌ల కొత్త రేట్లు ఇవే!

 

ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ప్లాన్‌కి డిమాండ్ పెరిగేలోపు మీరు వాడుకోండి..

ఈ ప్లాన్లలో ముఖ్యంగా రూ.107 ప్లాన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగాలు ఇస్తోంది. ఇక రూ.798 ఫ్యామిలీ ప్లాన్ అయితే కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది. ఈ బడ్జెట్‌లో ఈ స్థాయి ఫీచర్లు ప్రస్తుత మార్కెట్లో ఇంకెక్కడా కనిపించవు. కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఆలస్యం చేస్తే, మీకు తర్వాత అసహనం తప్పదు. మీరు కూడా BSNL కస్టమర్ అయితే ఇప్పుడే ఈ ప్లాన్‌లు తీసుకోండి. మీ డేటా, కాలింగ్ అవసరాలను తక్కువ ధరలో సులభంగా తీర్చుకోండి. ఇక రీచార్జ్ చేసే ముందు ఏ ప్లాన్ తీసుకోవాలి అనే సందేహం ఉండదు. BSNL మీకోసం సరైన పరిష్కారం తీసుకొచ్చింది.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #BSNL #NewRchargePlan #GoodNews #Users